Share News

న్యాయసేవలు అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:23 PM

సమాజంలో ప్రతిఒక్కరి కీ న్యాయసేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి జి.అర్చన పేర్కొన్నారు.

న్యాయసేవలు అందించడమే లక్ష్యం
మాట్లాడుతున్న న్యాయాధికారి జి.అర్చన

ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి జి.అర్చన

ఆదోని, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రతిఒక్కరి కీ న్యాయసేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి జి.అర్చన పేర్కొన్నారు. సోమవారం ఆదోనిలోని బీసీ బాలుర హాస్టల్‌లో జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయాధికారి జి.అర్చన మాట్లాడుతూ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఉచితంగా న్యాయ సాయాన్ని అందించేందుకే భారత ప్రభుత్వం ‘లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస యాక్ట్‌’ (న్యాయసేవల అధికారిక చట్టం) తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం 1995 నవంబరు 9 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు. దాంతో ప్రతియేటా నవంబరు 9న జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధనిక, పేద అనే తేడా లేకుండా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, సమాజంలో ఉన్నత భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో సీనియర్‌ న్యాయవాదులు ఎం.వి.లోకే్‌షకుమార్‌, పి.రాజేంద్రప్రసాద్‌, హాస్టల్‌ వార్డెన్‌ అనిమిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:23 PM