Share News

రైతుల శ్రేయస్సే లక్ష్యం

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:32 PM

రైతుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.

రైతుల శ్రేయస్సే లక్ష్యం

ఎమ్మెల్యే జయసూర్య

రైతులకు పాసు పుస్తకాల పంపిణీ

నందికొట్కూరురూరల్‌, ఫిబ్రవరి3 (ఆంధ్రజ్యోతి) : రైతుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మంగళవారం మండలంలోని శాతనకోట గ్రామంలో మీభూమి మీహక్కు కార్యక్రమాన్ని తహసీల్దారు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయసూర్య హాజరై ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్తుపుస్తకాలను గ్రామ రైతులకు పంపిణీచేశారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కును లబ్ధిదారురాలు రాధమ్మ అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ మాండ్ర సురేంద్రనాథరెడ్డి, వీఆర్వోలు ఆనంద్‌, స్వాములు, వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్‌ అహ్మద్‌ హుశ్శేన, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:32 PM