పత్తికొండ అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:47 PM
పత్తికొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తు న్నానని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
హంద్రీ నీవాకు కాలువల ఏర్పాటుతో
వేల ఎకరాలకు సాగు నీరు
రైతులకు రాజముద్రతో పట్టాదారు
పాసుపుస్తకాలు
ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
పత్తికొండ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యో తి): పత్తికొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తు న్నానని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం పత్తికొండ మండలంలో ఆ యన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా పెద్దహుళ్తి పంచాయతీ కార్యాల యంలో తహసీల్దార్ ఉసేన సాహెబ్ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అక్కడి నుంచి పత్తికొండ మారెమ్మ దేవాలయం వద్ద చెరువును పరిశీలించి కంప చెట్ల తొలగింపుపై అదికారులకు పలు సూచనలు అందించారు. అనంతరం కార్యాల యంలో అంగనవాడీ ఆధ్వర్యంలో పోషన పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయ న మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పని చేస్తున్నారన్నారు. చె రువులు జలకళతో కళ కళలాడుతున్నాయని అన్నారు. అదేవిధంగా హంద్రీనీవా కాల్వకు స్రూయిజ్‌లు ఏర్పాటు చేసి వేలాది ఎకరాలకు సాగు నీరంది స్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కవిత, ఇరిగేషన ఏఈ వేణుగోపాల్, ఏపీవో వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్ రెడ్డి , కడవల సుధాకర్, మాజీ సర్పంచ తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.