వైభవంగా గంజహళ్లి ఉరుసు
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:29 AM
మండలంలోని గంజహళ్లి గ్రామంలో వెలసిన మహాత్మా బడేసాహెబ్ ఉరుసు మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది.
భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు
తరలివచ్చిన భక్తులు
గోనెగండ్ల, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని గంజహళ్లి గ్రామంలో వెలసిన మహాత్మా బడేసాహెబ్ ఉరుసు మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామున స్వామివారికి పీఠాధిపతులు గంధం తీసుకువెళ్లిన తరువాత ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా కర్నూలు, నంద్యాల, జిల్లా నుంచే కాక తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, రాష్ర్టాల నుంచి భక్తులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. పలు రాజకీయ పార్టీల నాయకులు స్వామి ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలను రంగురంగుల విద్యుత దీపాలతో అందంగా అలంకరించారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. స్వామివారి ఉరుసులో పాల్గొన్న భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, విశ్రాంతి వసతి, తాగునీరు, ఉచిత భోజనం ఏర్పాటు చేశామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్వామివారి మునిమనవళ్లు దర్గా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, ఫీఽఠాధిపతి చిన్నముద్దుగోలుస్వామి, పీఠాధిపతి షేక్ మహాబాబ్‌బాషా తెలిపారు.
ఆకట్టుకున్న దుకాణాలు
ఉరుసులో మట్టిగాజుల అంగళ్లు, బొమ్మల అంగళ్లు మహిళలను, పిల్లలను, ఆకట్టుకున్నాయి. స్వామివారి దర్శనం అనంతరం అంగళ్ల దగ్గరే మహిళలు పెద్ద ఎత్తున గుమి గూడి గాజులను, బొమ్మలను కొనుగోలు చేశారు. యువకులు, పిల్లలు, అధిక సంఖ్యలో ఉరుసు కార్యక్రమానికి హాజరయ్యారు. రంగురాట్నాలు కూడా పిల్లలను విశేషంగా అకట్టుకున్నాయి.
గట్టి పోలీస్ బందోబస్తు
ఉరుసులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గోనెగండ్ల సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, ఏఎ్‌సఐ, 26 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 56 మంది పీసీలు, హెచజీ 51 తో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఆర్‌టీసీ బస్సులు, ఆటోలు, ట్రాక్టర్‌లు, ద్విచక్రవాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.