వీడిన ఉత్కంఠ
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:42 PM
ర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారంను సరఫరా చేసే డైట్ టెండర్‌పై ఉత్కంఠ వీడింది. రెండు నెలల తర్వాత గుంటూరు చెందిన సుఖవాసి శ్రీనివాసరావు డైట్ టెండర్‌ను దక్కించుకున్నారు.
సుఖవాసి శ్రీనివాసరావుకు దక్కిన డైట్ టెండర్
ఫ లక్కి డిప్ ద్వారా ఎంపిక చేసిన జేసీ
కర్నూలు హాస్పిటల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారంను సరఫరా చేసే డైట్ టెండర్‌పై ఉత్కంఠ వీడింది. రెండు నెలల తర్వాత గుంటూరు చెందిన సుఖవాసి శ్రీనివాసరావు డైట్ టెండర్‌ను దక్కించుకున్నారు. బుధవారం డైట్ టెండర్‌లకు కలెక్టరేట్‌లోని జేసీ చాంబరులో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధ్యక్షతన టెండర్ల ప్రక్రియ జరిగింది. ఈ టెండర్లలో15 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది బరిలో నిలిచారు. బరిలోఉన్న 9 మంది డైట్ కాంట్రాక్టర్ల పేర్లతో జా యింట్ కలెక్టర్ లక్కిడిప్ ద్వారా గుంటూరుకు చెందిన సుఖవాసి శ్రీనివాసరావు పేరును కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఎంపికైన డైట్ కాంట్రాక్టర్ రోగులకు నాణ్యమైన ఆహారంను అందించాలని జేసి తెలిపారు. డైట్ భవనంను ఆధునీకీకరించాలని, ఎంపికైన కాంట్రాక్టర్ లోకల్‌లో ఆఫీసు తెరవాలని కోరారు. సీఎస్‌ఆర్‌ఎంవో డా.పి.పద్మజ, ఆర్‌ఎంవో డా.వెంకటరమణ, ఏడీ మల్లేశ్వరమ్మ, సీనియర్ అసిస్టెంట్ చక్రిధర్; హెల్త్ ఇన్సపెక్టర్ గోవిందు స్వామి, బిడ్డర్లు పాల్గొన్నారు.