Share News

వీడని ఉత్కంఠ!

ABN , Publish Date - May 19 , 2026 | 12:13 AM

మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన షాపుల వేలం పాట వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న దేవస్థానానికి చెందిన 10 షాపులకు బహిరంగ వేలం నిర్వహించారు. వీటి ద్వారా నెలకు సుమారు రూ.6,61,000 ఆదాయం సమకూరనుంది. అయితే వేలం పాట అనంతరం వెలుగులోకి వచ్చిన భూ వివాద అంశాలు పాటదారుల్లో తీవ్ర ఆందోళన రేపాయి. వేలం నిబంధనల ప్రకారం షాపులు దక్కించుకున్న వారు ఆరు నెలల అడ్వాన్స్‌తో పాటు 18 శాతం జీఎస్టీ మొత్తాన్ని కూడా 72 గంటలలోపు డిమాండ్‌ డ్రాప్టుల రూపంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారికి చెల్లించాల్సి ఉంది. కానీ వేలం అనంతరం శనివారం అమావాస్య, తదుపరి ఆదివారం కారణంగా బ్యాంకులు పని చేయకపోవటంతో డీడీల తయారీలో ఆలస్యం జరిగిందని పాటదారులు చెబుతున్నారు. సోమవారంతో 72 గంటలు పూర్తయినప్పటికీ పాటదారులు డీడీలు చెల్లించలేదు.

 వీడని ఉత్కంఠ!

- మోపిదేవి దేవస్థానం షాపుల వేలంపై విచిత్ర పరిస్థితి

- 14న వేలంలో పది షాపులు పాడుకున్న వ్యాపారులు

- హైకోర్టు వివాదం, చెరువు భూమి అంశాలపై ఆందోళనతో వెనకడుగు

- 72 గంటలు గడిచినా చెల్లించని డీడీలు

మోపిదేవి, మే 18 (ఆంధ్రజ్యోతి):

మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన షాపుల వేలం పాట వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న దేవస్థానానికి చెందిన 10 షాపులకు బహిరంగ వేలం నిర్వహించారు. వీటి ద్వారా నెలకు సుమారు రూ.6,61,000 ఆదాయం సమకూరనుంది. అయితే వేలం పాట అనంతరం వెలుగులోకి వచ్చిన భూ వివాద అంశాలు పాటదారుల్లో తీవ్ర ఆందోళన రేపాయి. వేలం నిబంధనల ప్రకారం షాపులు దక్కించుకున్న వారు ఆరు నెలల అడ్వాన్స్‌తో పాటు 18 శాతం జీఎస్టీ మొత్తాన్ని కూడా 72 గంటలలోపు డిమాండ్‌ డ్రాప్టుల రూపంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారికి చెల్లించాల్సి ఉంది. కానీ వేలం అనంతరం శనివారం అమావాస్య, తదుపరి ఆదివారం కారణంగా బ్యాంకులు పని చేయకపోవటంతో డీడీల తయారీలో ఆలస్యం జరిగిందని పాటదారులు చెబుతున్నారు. సోమవారంతో 72 గంటలు పూర్తయినప్పటికీ పాటదారులు డీడీలు చెల్లించలేదు.

నగదు చెల్లించి చిక్కుల్లో పడతామనే భయం!

ఇదే సమయంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించిన స్థలం సర్వే నెంబరు 633కు సంబంధించిన వివాదం కొత్త మలుపు తిప్పింది. సంబంధిత భూమి రెవెన్యూ రికార్డుల్లో చెరువు భూమిగా నమోదై ఉంది. చెరువు స్థలాల్లో నిర్మాణాలపై చట్టపరమైన పరిమితులు ఉండటం, ఇదే సర్వే నెంబర్‌పై హైకోర్టులో వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం వెలుగులోకి రావటంతో వేలం పాటలో పాల్గొన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం కోసం కూడబెట్టుకున్న సొమ్ము కోర్టు ఉత్తర్వులు లేదా భూ వివాదాల కారణంగా ప్రమాదంలో పడితే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు పాటదారుల నుంచి వస్తోంది. ఇప్పటికే కొంతమంది ముందస్తు చెల్లింపులు చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న సందేహం నెలకొంది. హైకోర్టు వివాదం, భూ హక్కుల అంశంపై స్పష్టత వచ్చే వరకు ముందుకు వెళ్లాలా? వద్దా అన్న దానిపై వారు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

గ్రామస్థుల్లో భిన్నాభిప్రాయాలు

ఈ వ్యవహారంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దేవస్థానం ఆదాయం పెరగటం శుభపరిణామం అంటుండగా, మరి కొందరు భూమి వివాదం పూర్తిగా పరిష్కారం కాకముందే వేలం నిర్వహించటం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. దేవదాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ, న్యాయనిపుణులు దీనిపై స్పష్టత ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు. వేలంపాటలో సూచించిన నిబంధనల మేరకు ఆరు నెలలు అద్దె అడ్వాన్స్‌ పేమెంట్‌లు తగ్గించి మూడు నెలలకు కుదించినట్లయితే చెల్లించగలమని వ్యాపారులు దేవదాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారుల నుంచి ఏ విధమైన హామీ లభించకపోవటంతో వారు వెనుతిరిగినట్లు సమాచారం వేలం పాటలు నిర్వహించి 72 గంటలు పూర్తయ్యింది. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన డీడీలు చెల్లించలేదు. అధికారుల నుంచి కోర్టు వివాదాలకు సంబంధించి వ్యాపారులకు స్పష్టమైన హామీ రాలేదని సమాచారం. వ్యాపారులకు షాపులు కేటాయిస్తారా? లేని యెడల పాటలో పాల్గొన్నప్పుడు చెల్లించిన డీడీలు తిరిగి ఇస్తారా? రద్దు చేస్తారా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Updated Date - May 19 , 2026 | 12:13 AM