ఆడపిల్లల చదువు దేశ పురోగతికి మూల స్తంభం
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:53 PM
ఆడపిల్లల చదువుకు టుంబానికే కాక దేశ పురోగతికి మూలస్తంభం అని ప్రముఖ వ్యక్తిత్వ వి కాస నిపుణురాలు, లైఫ్ కోచ సౌమ్యశ్రీ అన్నా రు.
ఆదోని అగ్రికల్చర్, జూలై 5(ఆంధ్రజ్యోతి) : ఆడపిల్లల చదువుకు టుంబానికే కాక దేశ పురోగతికి మూలస్తంభం అని ప్రముఖ వ్యక్తిత్వ వి కాస నిపుణురాలు, లైఫ్ కోచ సౌమ్యశ్రీ అన్నా రు. ఆదివారం ప్రభు త్వ బాలికల వసతి గృహంలో ఆదోని సివిక్స్ సొసైటీ మన ఊరు మన బాధ్యతలో భాగంగా బాలికలకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల విద్యా ద్వారా లింగ సమానత్వం, ఆర్థిక వృద్ధి సాధించవచ్చన్నారు. పేదరిక నిర్మూలనకు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పాటునిస్తుందన్నారు. చదువు పట్ల నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచిగా చదువుకొని ఉన్నతంగా రాణించాలని సూచించారు. జీవనగమనంలో దేనికి కృంగిపోకుండా జీవించడం ఎలాగో ఆత్మవిశ్వాసం కల్పించారు. కార్యక్రమంలో సివిక్స్ సొసైటీ అధ్యక్షులు రఘురాం, కార్యదర్శి కృష,్ణ ప్రాజెక్టు సమన్వయకర్త విట్ట సతీష్ విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటేష్, నాగనాథ్ పాల్గొన్నారు.