శిథిలమైన రైలింగ్‌ను తొలగించాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:00 AM
శిథిలమైన రైలింగ్‌ను వెంట నే తొలగించి, తాత్కాలికంగా పైపులతో భద్రతా కంచెను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పార్థసారథి అధికారులను ఆదేశించారు.
- ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి
- క్షేత్రస్థాయిలో పాత బ్రిడ్జి పరిశీలన
ఆదోని, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): శిథిలమైన రైలింగ్‌ను వెంట నే తొలగించి, తాత్కాలికంగా పైపులతో భద్రతా కంచెను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పార్థసారథి అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని దశాబ్దాల క్రితం నాటి పాత బ్రిడ్జి రైలింగ్, పిట్టగోడలు బలహీనపడి శిథిలావస్థకు చేరుకోవడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక వ్యా పారులతో, ప్రజలతో మాట్లాడారు. బ్రిడ్జిపై రాకపోకలు సాగించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసినప్పుడు గోడలు ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందన్నారు. బ్రిడ్జి ప్రస్తుత సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు నిపుణులతో లోడ్‌టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతామన్నారు. ఎమ్మెల్యే వెంట నేషనల్ హైవే ఈఈ విజయభాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నయూం అహమ్మద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.