Share News

కూటమి ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:56 PM

ప్రజల సమస్యలు పరిష్కరిం చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు.

కూటమి ప్రభుత్వం విఫలం
జొన్నగిరిలో మాట్లాడుతున్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

తుగ్గలి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు పరిష్కరిం చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జొన్నగిరిలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ గుంతా దేవి, గుంతా రఘు జొన్నగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో మహిళలకు నెలకు రూ.1,500లు అందించాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వేతనాలు కూడా చెల్లించాలన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ ఎర్రనాగప్ప, ఫక్కీరప్ప, శీనప్ప, తదితరులున్నారు.

చిప్పగిరి: ఈనెల 16 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలపై భయం వీడి ధైర్యంగా పరీక్షలు రాసి మంచి గ్రేడ్‌లలో ఉత్తీర్ణత సాధించాలని ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షి సూచించారు. శుక్రవారం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల వార్షికో త్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు.

Updated Date - Mar 13 , 2026 | 11:56 PM