నిందితులను అరెస్టు చేయాలి
ABN , Publish Date - May 21 , 2026 | 11:57 PM
పట్టణంలో వీఆర్వో బి.టి. సు రేష్‌ను కిడ్నాప్ చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ డిమాండ్ చేశారు.
ఆదోని, మే 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో వీఆర్వో బి.టి. సు రేష్‌ను కిడ్నాప్ చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ డిమాండ్ చేశారు. గురువారం టీడీపీ పట్టణాధ్యక్షుడు తిమ్మప్ప, వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవా, బీజేపీ నాయకులు సాయి, చంద్ర, మధు, రవి, వాల్మీకులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అధికారికి వినతి పత్రం అం దజేశారు. వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త బత్తిన కుబేర్‌నాథ్ తన అనుచరులతో కలిసి ప్రభుత్వ ఉద్యోగి సురే్‌షను కిడ్నాప్ చేశారన్నారు. కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు తాను తీసుకున్న అప్పును త్వరలో చెల్లిస్తానని మొరపెట్టుకున్నా, స్థానిక పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. భార్య జయలక్ష్మి పోలీసులను ఆశ్రయించగా వారు జోక్యం చేసుకుని తీసుకొచ్చారన్నారు. కిడ్నా్‌పకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాల్మీకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.