Share News

లెక్క తేలింది...!

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:01 AM

ఎట్టకేలకు పురపోరు లెక్క తేలింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నాలుగు టీడీపీ- రెండు వైసీపీ చొప్పున విజయం సాఽధించాయి.

       లెక్క తేలింది...!
నంద్యాల చైర్మనగా డాక్టర్‌ బాబన

ఫ పురపోరులో కూటమికి గట్టి పోటీ ఇచ్చిన వైసీపీ

ఫ నాలుగు టీడీపీ, రెండు వైసీపీ కైవసం

ఫ 8407 ఓట్ల మెజార్టీతో నంద్యాల చైర్మనగా డాక్టర్‌ బాబన విజయం

ఫ విజయోత్సాహంలో కూటమి నాయకులు

నంద్యాల, నవంబరు4(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు పురపోరు లెక్క తేలింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నాలుగు టీడీపీ- రెండు వైసీపీ చొప్పున విజయం సాఽధించాయి. నంద్యాల మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ, వైసీపీ నువ్వా.. నేనా అన్నట్టుగా గట్టి పోటీ కొనసాగింది. పురపోరులో చైర్మన పీఠాల నుంచి వార్డుల వరకు పరిశీలిస్తే.. కూటమికి వైసీపీ గట్టి పోటీ ఇచ్చినట్లైంది. ఆయితే ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నంద్యాల మున్సిపాలిటీతో పాటు బేతంచెర్ల కౌంటింగ్‌ అర్థరాత్రి వరకు కొనసాగడం అభ్యర్థులతో పాటు అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారినట్లైంది. ఏది ఏమైనా పురపోరు కూటమి సత్తా చాటడటంతో కూటమి వర్గాల్లో విజయోత్సాహం కనిపిస్తోంది. మరోవైపు చివరికి వరకు గట్టి పోటీ ఇచ్చి రెండు మున్సిపాలిటీలతో సరిపెట్టుకున్న వైసీపీలోను రాజకీయంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభ్యర్థుల్లో జోష్‌ వచ్చినట్లైంది.

ఫ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పోలైన ఓటర్లు, పార్టీల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు:

-------------------------------------------------------

మున్సిపాలిటీలు పోలైన చెల్లని లెక్కించిన టీడీపీ వైసీపీ జనసేన నోటా ఇతరులు

ఓట్లు ఓట్లు ఓట్లు ఓట్లు ఓట్లు ఓట్లు ఓట్లు

నందికొట్కూరు 29,220 864 28,356 11,999 14,619 - 156 1582

ఆత్మకూరు 3210 36 3174 940 929 - 25 1280

బేతంచెర్ల 24,570 643 23,927 10,584 12,290 701 145 207

డోన 35,397 384 35,013 17,030 16,696 1011 211 65

నంద్యాల 1,24,501 1890 1,22,611 55,398 57,262 1274 356 8321

------------------------------------------------------------

మొత్తం 2,16,898 3817 2,12,331 95,951 1,01,796 2986 893 11,455

---------------------------------------------------------------------

ఫ 8407 ఓట్ల మెజార్టీలో డాక్టర్‌ బాబన విజయం..

ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌తో చివరికి చైర్మన పీఠం టీడీపీ వశమైంది. ఏకంగా 8407 ఓట్ల మెజార్టీతో డాక్టర్‌ బాబన విజయం సాధించారు. దీంతో నంద్యాల మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. ఆయితే 52 వార్డుల్లో వైసీపీ -27, టీడీపీ-24, బీజేపీ-1 చొప్పున గెలుపొందారు. ఈ లెక్కన వార్డుల పరంగా వైసీపీ కూడా సత్తా చాటినట్లైంది. మొత్తంగా 52 వార్డుల్లో క్రాస్‌ ఓటింగ్‌తోనే డాక్టర్‌ బాబన అత్యధిక మెజార్టీతో నంద్యాల మున్సిపాలిటీ చైర్మన పీఠాన్ని కైవసం చేసుకున్నట్లైంది.

Updated Date - Nov 05 , 2026 | 12:01 AM