Share News

మాతా-శిశువుల కోసం ‘తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:28 AM

మాతా-శిశు సంక్షేమంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వ కొత్తగా..

మాతా-శిశువుల కోసం ‘తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’

  • ‘102’ వాహనాలను పరిశీలించిన సీఎం.. డిజైన్లకు ఆమోదం

అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మాతా-శిశు సంక్షేమంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వ కొత్తగా ‘తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ పేరిట ‘102’ వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వాహనాలను సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశీలించి, వీటి డిజైన్లకు ఆమోదం తెలిపారు. ప్రసూతి సాయం కోసం ‘102’ నంబర్‌కు కాల్‌ చేసి ఈ సేవలు పొందవచ్చు. ఈ వాహనాల ద్వారా ఏటా సుమారు 2.75 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. కార్యక్రమంలో హెల్త్‌ సెక్రటరీ వీరపాండియన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 05:29 AM