తాలీం-ఏ-హునర్‌కు విశేష స్పందన
ABN , Publish Date - May 13 , 2026 | 05:10 AM
రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న తాలీం-ఏ-హునర్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
7 వేల మందికిపైగా దరఖాస్తులు
17న టాలెంట్ టెస్ట్: వక్ఫ్ చైర్మన్ అజీజ్
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న తాలీం-ఏ-హునర్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. 7వేల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈనెల 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, నంద్యాల, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్‌తోపాటు సరైన ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని వివరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం తాలీం-ఏ-హునర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.