ముగిసిన టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:35 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ముగిశాయి. అన్ని ప్రధాన సబ్జెక్టుల్లో 99.05శాతం హాజరు నమోదైంది. మార్చి 16న పరీక్షలు ప్రారంభమయ్యాయి..
99.05 శాతం హాజరు నమోదు.. 6 నుంచి మూల్యాంకనం
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ముగిశాయి. అన్ని ప్రధాన సబ్జెక్టుల్లో 99.05శాతం హాజరు నమోదైంది. మార్చి 16న పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ విద్యార్థులు 6,22,152 మంది, ప్రైవేటు అభ్యర్థులు 19,568 మంది పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3415 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నట్టు వివరించారు.