Share News

నామినేషన్లలో ఉద్రిక్తత

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:54 PM

మంత్రాలయం ఎంపీటీసీ ఎన్నికల నామినేషనలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుధవారం ఎంపీటీసీ నామినేషన ప్రక్రియ ప్రారంభమవడంతో ఎంపీడీవో కార్యాలయంకు వెళ్లే ద్వారం వద్ద వైసీపీ జిల్లా కార్యదర్శి, మాజీ వ్యవసాయ సలహ మండలి చైర్మన సీవీ విశ్వనాథరెడ్డి తన కారులో వచ్చారు. టీడీపీ నాయకుడు రఘునాథరెడ్డి ఎందుకొచ్చావని ప్రశ్నించడంతో వైసీపీ నాయకుడు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

      నామినేషన్లలో ఉద్రిక్తత
మంత్రాలయంలో ఘర్షణ జరుగుతున్న దృశ్యం

వైసీపీ నాయకుడిపై టీడీపీ కార్యకర్తల దాడి

కారు అద్దాలు ధ్వంసం

పోలీసుల భారీ బందోబస్తు

మంత్రాలయం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం ఎంపీటీసీ ఎన్నికల నామినేషనలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుధవారం ఎంపీటీసీ నామినేషన ప్రక్రియ ప్రారంభమవడంతో ఎంపీడీవో కార్యాలయంకు వెళ్లే ద్వారం వద్ద వైసీపీ జిల్లా కార్యదర్శి, మాజీ వ్యవసాయ సలహ మండలి చైర్మన సీవీ విశ్వనాథరెడ్డి తన కారులో వచ్చారు. టీడీపీ నాయకుడు రఘునాథరెడ్డి ఎందుకొచ్చావని ప్రశ్నించడంతో వైసీపీ నాయకుడు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు సీవీ విశ్వనాథరెడ్డిని వారి నుంచి కాపాడి కారులో ఎక్కించి పంపారు. రాళ్లు, కట్టెలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. అరగంటసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహన, డీఎస్పీ శ్రీనివాసులు, మంత్రాలయం సీఐ గిరిబాబు, ఎస్‌ఐ మల్లికార్జున, పోలీసులు భారీ ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. విశ్వనాథరెడ్డి కారులో రాంపురానికి రోడ్డుపై వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో దాడి చే స్తూ ఈలలు, కేకలు వేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అర కిలోమీటరు వరకు బందోబస్తు చేపట్టారు. దాడికి పాల్పడటం అప్రజాస్వామికమని ఖండిస్తూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన అనుచరులతో మత్రాలయానికి బయలుదేరారు. మరింత ఉద్రిక్తత నెలకొంటుందన్న ఉద్దేశంతో రాంపురం వద్ద పోలీసులు ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నాయకులు, కార్యక్తలను అడ్డుకుని తిరిగి పంపించారు. మాధవరం సర్కిల్‌లో వైసీపీ కార్యకర్తలు రాకుండా బారికేడ్లు, ఇనుప ముళ్లకంచెలు రోడ్డుకు అడ్డంగా వేశారు. ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాసులుకు సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ప్రదీప్‌రెడ్డి, బాధితుడు సీవీ విశ్వనాథరెడ్డి, దశరథరెడ్డి, పురుషోత్తంరెడ్డి, కరణం గురురాజరావు, రాఘవరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, కాంతరెడ్డి, మంత్రాలయం మాజీ సర్పంచు తెల్లబండ్ల భీమయ్య ఫిర్యాదు చేశారు.

టీడీపీ నాయకులపై కేసు నమోదు

వైసీపీ నాయకుడిపై దాడికి పాల్పడిన మాధవరం మాజీ సర్పంచు రఘునాథరెడ్డి, సోదరుడి కొడుకు రాజారెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. అడ్డగించి, భయపెట్టి, దాడిచేయడం, కారును ధ్వంసం చేయడం వంటి అంశాలపై బాధితుడు విశ్వనాథరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

తొలిరోజు నామినేషన్లు నిల్‌

తొలిరోజు బుధవారం హింసాత్మక సంఘటన జరగడంతో నామినేషన వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో 18 ఎంపీటీసీలకు నామినేషన్లు వేయాల్సి ఉండగా సాయంత్రం వరకు ఒక్క నామినేషన కూడా దాఖలు చేయలేదని ఎన్నికల అధికారి బాలవర్ధిని రాజు, నూర్జహాన, రమాదేవి తెలిపారు.

Updated Date - Oct 21 , 2026 | 11:54 PM