విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:13 PM
విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొంత కాలంగా విజయ డెయిరీకి సంబంధించి ముత్యాలపాడు ఎన్నికలు, ఆ సంఘం అధ్యక్ష పదవి గురించి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
ఎండీ, త్రిసభ ్య కమిటీ సభ్యుడిపై బైండోవర్
సీఐ ఈశ్వరయ్య, డైరెక్టర్ మధుసూదనరెడ్డి మధ్య వాగ్వాదం
నంద్యాల టౌన, జనవరి 7(ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొంత కాలంగా విజయ డెయిరీకి సంబంధించి ముత్యాలపాడు ఎన్నికలు, ఆ సంఘం అధ్యక్ష పదవి గురించి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదిలా ఉంటే సోమవారం భూమా విఖ్యాతరెడ్డి రావడంతో ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. త్రిసభ్య కమిటీ సభ్యులు పీపీ మధుసూదనరెడ్డి, గంగుల విజయసింహరెడ్డి, రవికాంతరెడ్డి కొన్ని రోజుల కిత్రం ముత్యాలపాడు సభ్యులకు నోటీసులు జారీచేశారు. వారు కమిటీ హాజరుకావాలని ఆదేశించారు. ఈవివాదాల వల్ల ప్రతిసారి వాయిదా వేస్తున్నారు. బుధవారం మళ్లీ పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో త్రిసభ్య కమిటీ సభ్యులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈనెల 10న మళ్లీ కమిటీ హాజరు కావాలని ఉంది. దీంతో ముందస్తుగా త్రిసభ్య కమిటీ సభ్యులను బైండోవర్ చేయాలని తాలుకా పోలీసులు విజయ డెయిరీ వద్దకు చేరుకున్నారు. డైరెక్టర్ ఒకరు గేటు తాళాలు వేసి ఉండడంతో పగలగొట్టి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఎండీ ప్రదీ్‌పకుమార్, త్రిసభ్య కమిటీ సభ్యుడు రవికాంతరెడ్డిపై బైండోవర్ చేసి ఎమ్మార్వో శ్రీనివాసులు ముందు హాజరుపరిచారు. డైరెక్టర్లు మాట్లాడుతూ పోలీసులను అడ్డు పెట్టుకుని ఇలా చేయడం ఏమిటనీ ప్రశ్నించారు. విజయ డెయిరీ తరఫున ఎలాంటి గొడవలు లేవని, కావాలనే రెండు రోజులకు ఒకసారి వాళ్లే వచ్చి ఇక్కడ వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆరోపించారు. పోలీసులు వారికి మద్దతు పలకడం సరైంది కాదన్నారు. నోటీసులకు తప్పనిసరిగా ముత్యాలపాడు సభ్యులు రాత పూర్వకంగా కానీ, పోస్టు ద్వారా వివరణ ఇవ్వాలన్నారు.