Share News

డిప్యూటీ కలెక్టర్‌గా టెన్నిస్‌ స్టార్‌ సాకేత్‌

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:42 AM

టెన్నిస్‌ క్రీడాకారుడు మైనేని సాకేత్‌ ఎన్టీఆర్‌ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. నియామక పత్రాలను విజయవాడలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ చేతుల మీదుగా సాకేత్‌ గురువారం అందుకున్నారు.

డిప్యూటీ కలెక్టర్‌గా టెన్నిస్‌ స్టార్‌ సాకేత్‌

విజయవాడ సిటీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): టెన్నిస్‌ క్రీడాకారుడు మైనేని సాకేత్‌ ఎన్టీఆర్‌ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. నియామక పత్రాలను విజయవాడలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ చేతుల మీదుగా సాకేత్‌ గురువారం అందుకున్నారు. విజయవాడకు చెందిన సాకేత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో సత్తా చాటడంతోపాటు ప్రపంచస్థాయి పోటీల్లో సింగిల్స్‌, డబుల్స్‌, మిక్సిడ్‌ డబుల్స్‌లో నైపుణ్యం చూపి... పలు టైటిల్స్‌ కైవశం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన సాకేత్‌కు నేరుగా డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు ఆయన ఉద్యోగంలో చేరారు.

Updated Date - Mar 06 , 2026 | 04:43 AM