Amaravati Quantum Valley: క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి టెండరు ఖరారు
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:49 AM
రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి సంబంధించి మరో కీలక అడుగు పడింది.
‘ఎల్ అండ్ టీ’ ఎల్-1 బిడ్‌కు సీఆర్డీఏ ఆమోదం
గుంటూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి సంబంధించి మరో కీలక అడుగు పడింది. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) నిర్మాణానికి టెండరు ఖరారయింది. దీనికి సంబంధించిన ఎల్-1 బిడ్‌ను ఏపీ సీఆర్డీఏ శుక్రవారం ఆమోదించింది. రూ.103 కోట్లకు కాంట్రాక్టు దక్కించుకున్న ‘ఎల్ అండ్ టీ’ సంస్థకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ (ఎల్‌వోఏ)ని అందజేసింది. దీని ప్రకారం కంప్యూటింగ్ సెంటర్ నమూనా రూపకల్పన, నిర్మాణాన్ని సదరు కాంట్రాక్టు సంస్థే చేపట్టనుంది. కంప్యూటింగ్ సెంటర్‌కు సీఆర్డీఏ నిధుల నుంచి రూ.137కోట్లు కేటాయిస్తూ మున్సిపల్ శాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.