తెలుగు రాష్ట్రాల్లోనే కేజీబీవీ విద్యార్థినులు అత్యధికం: కేంద్రం
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:45 AM
దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ)అత్యధికంగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ)అత్యధికంగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం, లోక్‌సభలో సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. తెలంగాణలోని కేజీబీవీల్లో 1,41,771మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారని, బాలికల ఎన్‌రోల్‌మెంట్‌తో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రెండోస్థానంలో ఉన్న ఏపీలో 1,03,733 మంది బాలికలు కేజీబీవీల్లో విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాలలోని 5,316 కేజీబీవీల్లో 7.58 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారని మంత్రి తెలిపారు.