Share News

తెలుగు యువ ఇంజనీర్‌.. సాయినాథ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:56 AM

డైమెన్షనల్‌ ఇంజనీరింగ్‌లో తెలుగు యువ ఇంజనీర్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గుంటూరుకు చెందిన ఆకెళ్ళ నరసింహ సాయినాథ్‌..

తెలుగు యువ ఇంజనీర్‌.. సాయినాథ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

  • టెస్లా సంస్థలో ఉద్యోగానికి ఆహ్వానం

విజయవాడ కల్చరల్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): డైమెన్షనల్‌ ఇంజనీరింగ్‌లో తెలుగు యువ ఇంజనీర్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గుంటూరుకు చెందిన ఆకెళ్ళ నరసింహ సాయినాథ్‌.. దాదాపు దశాబ్ద కాలంగా తన సృజనాత్మకను చాటుతూ రెండు అమెరికా పేటెంట్లు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్‌ వచ్చింది. సాయినాథ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ పట్టా పొందారు. డైమెన్షనల్‌ ఇంజనీరింగ్‌ రంగంలో కీలక నైపుణ్యాలను అభ్యసించారు. కాన్సెప్ట్‌ డెవల్‌పమెంట్‌ నుంచి ప్రొడక్షన్‌ వ్యాలిడేషన్‌ వరకు ఈ రంగంలో ఉన్నత స్థాయి నిపుణుడిగా ఎదిగారు. పాలీవర్క్స్‌, 3డీ స్కానింగ్‌, డిజిటల్‌ మెట్రాలజీ వంటి ఆధునిక సాంకేతికతపైనా పట్టు సాధించారు. ఈ నేపథ్యంలోనే అరిష్‌ దండు సహరచనలో రూపొందించిన లాండ్రీ డ్రయ ర్‌ ఉత్పత్తికి సంబంధించిన వినూత్న యాంత్రిక విధానానికి, ఎయిర్‌ కండిషన్‌ యూనిట్‌ కోసం న్యూమాటిక్‌గా పనిచేసే లూవర్‌ను రూపొందించినందుకు.. రెండు అమెరికా పేటెంట్లు కైవసం చేసుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొద్దిమందికే లభించే ఏఎ్‌సఎమ్‌ఈజీడీ అండ్‌ టీ సీనియర్‌ స్థాయి సర్టిఫికేషన్‌ను కూడా సాయినాథ్‌ సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఇంజనీరింగ్‌ నిపుణుల నుంచి కూడా ప్రశంసలందుకుంటున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 05:57 AM