Share News

ఎన్నారైల కోసం ఏపీ విధానాలు భేష్‌

ABN , Publish Date - May 22 , 2026 | 05:51 AM

గల్ఫ్‌ వలస కార్మికులు, ప్రవాసాంధ్రుల (ఎన్నారై) సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఐడీ, ఇతర ప్రభుత్వ విభాగాలు అమలు చేస్తున్న విధివిధానాలను అధ్యయనం చేయడానికి..

ఎన్నారైల కోసం ఏపీ విధానాలు భేష్‌

  • తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ కితాబు

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ వలస కార్మికులు, ప్రవాసాంధ్రుల (ఎన్నారై) సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం ఏపీ సీఐడీ, ఇతర ప్రభుత్వ విభాగాలు అమలు చేస్తున్న విధివిధానాలను అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ ప్రతినిధి బృందం గురువారం ఏపీలో పర్యటించింది. ఇక్కడ అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని ఆ బృందం ప్రశంసించింది. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన తెలంగాణ ప్రతినిధి బృందం డీజీపీతో పాటు ఎన్నారై విభాగం సభ్యులను కలిసి, విదేశాల్లో తెలుగు ప్రజలు, వలస కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ఏపీ ఎన్నారై వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివా్‌సతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది.

Updated Date - May 22 , 2026 | 05:51 AM