పట్టణ ఓటర్లలో 39.8శాతం కాంగ్రెస్‌వైపే
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:35 AM
ఏడు కార్పొరేషన్లకు, 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 37,80,493 ఓట్లు పోలయ్యాయి.
బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్ల శాతం 28.76
2 పార్టీల మధ్య వ్యత్యాసం 11.04శాతం
బీజేపీకి 15.68 శాతం ఓట్లు
8.31 శాతం ఓట్లు స్వతంత్రులకు
పోలైన మొత్తం ఓట్లు 37,80,493
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్ర జ్యోతి): ఏడు కార్పొరేషన్లకు, 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 37,80,493 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లలో అధికార కాంగ్రెస్ పార్టీ 15,04,669 ఓట్లు పొందింది. మొత్తం ఓటర్లలో వీరి వాటా 39.80 శాతంగా ఉంది. రెండో ప్రధాన పార్టీగా బీఆర్‌ఎస్ 10,87,158 ఓట్లు పొందగా.. బీజేపీ 5,92,753 ఓట్లు పొంది మూడో స్థానంలో ఉంది. మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థులు 3,14,096 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. అధికార పార్టీ, ప్రధాన ప్రతి పక్షం మధ్య ఓట్ల వ్యత్యాసం 11.04 శాతం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్రులు 8.31 శాతం ఓట్లు సాధించి నాలుగో పెద్దశక్తిగా నిలిచారు. ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ కొన్ని వార్డుల్లో అత్యధిక ఓట్లు సాధించాయి.