Share News

మల్లన్న సన్నిధిలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:17 PM

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో దర్శించుకు న్నారు.

   మల్లన్న సన్నిధిలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ
మంత్రికి ఙ్ఞాపికను ఇస్తున్న ఈవో, ట్రస్ట్‌బోర్డ్‌ సభ్యులు

శ్రీశైలం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో దర్శించుకు న్నారు. బుధవారం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి వేదపండితులతో తిలకధారణ చేయించి ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజ శర్మ పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకు మార్చనలు చేసుకున్న మంత్రి ప్రాకారంలోని పరివార దేవతాలయాలను కూడా దర్శించు కున్నారు. అనంతరం ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన వేదపండితులు తీర్థప్రసాదాలు ఇవ్వగా లడ్డూప్రసాదాలు, పరిమళ విభూది, శేషవస్త్రాలు, ఙ్ఞాపికను ఈవో అందజేశారు.

Updated Date - Apr 08 , 2026 | 11:17 PM