Share News

కేటీఆర్‌వి చిలుక పలుకులు: మంత్రి జూపల్లి

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:16 AM

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్‌ఎస్సేనని, ఇప్పుడు కేటీఆర్‌ చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

కేటీఆర్‌వి చిలుక పలుకులు: మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, జూలై1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్‌ఎస్సేనని, ఇప్పుడు కేటీఆర్‌ చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.8లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని, తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఈ విషయమై చర్చకు సిద్ధమేనా? అని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. కేటీఆర్‌, హరీశ్‌రావు రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టారని, ప్రజల సొమ్ముతో జల్సాలు చేశారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.20,157 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 04:16 AM