Share News

మా అబ్బాయి పెళ్లికి రండి

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:59 AM

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో...

మా అబ్బాయి పెళ్లికి రండి

  • సీఎం చంద్రబాబుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో కలసి ఆయన హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు. ముందుగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత వివాహ పత్రికను ఉంచి పూజలు చేశారు. అక్కడ నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి వివాహ పత్రికను అందజేశారు. పెళ్లికి రావాలని ఆహ్వానించారు. భట్టి, దుద్దిళ్లను సత్కరించిన సీఎం... వారికి శ్రీవారి ప్రతిమను అందజేశారు. అనంతరం భట్టితో సీఎం చంద్రబాబు సుమారు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. సీఎం నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చిన భట్టి, దుద్దిళ్లకు... మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌ ఆహ్వానం పలికారు. స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు చాంబర్‌లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్య ప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌, తెనాలి శ్రావణకుమార్‌ తదితరులకు భట్టి తన కుమారుడి పెళ్లి పత్రికలు అందించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చాంబర్‌కు వెళ్లారు. ఆయన లేకపోవడంతో పత్రికను మంత్రి మనోహర్‌కు అందించారు. సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలసి విజయవాడ ఆంధ్రరత్న భవన్‌కువెళ్లిన తెలంగాణ నేతలు... అక్కడ ఏపీసీసీ నేతలకు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

Updated Date - Feb 28 , 2026 | 04:59 AM