నేడు గుంటూరుకు టీ-సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:04 AM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గుంటూరుకు రానున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.
గుంటూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గుంటూరుకు రానున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ఈ వివాహ వేడుక గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో బుధవారం ఉదయం 9 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్న ఈ వేడుకకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.