Share News

Minister Savitha: పేద బ్రాహ్మణులకు త్వరలో గరుడ

ABN , Publish Date - Jan 09 , 2026 | 06:18 AM

రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు భరోసా ఇచ్చే ‘గరుడ’ పథకాన్ని త్వరలో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. ..

Minister Savitha: పేద బ్రాహ్మణులకు త్వరలో గరుడ

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు భరోసా ఇచ్చే ‘గరుడ’ పథకాన్ని త్వరలో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. సచివాలయంలో గురువారం ఈ పథకం విధి విధానాలపై బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ బుచ్చి రామ్‌ప్రసాద్‌తో మంత్రి చర్చించారు. అనంతరం సవిత మాట్లాడుతూ... ‘పేద బ్రాహ్మణులు మరణిస్తే అంత్యక్రియలకు ఆయా కుటుంబాలకు రూ.10 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. సీఎం చంద్రబాబు బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.

Updated Date - Jan 09 , 2026 | 06:18 AM