Mangalagiri: బాలిక కిడ్నాప్.. 9 మంది యువకుల అరెస్టు
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:13 AM
దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి 16 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకు వెళ్లిన కేసులో నిందితులను గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
మంగళగిరి సిటీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి 16 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకు వెళ్లిన కేసులో నిందితులను గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి అర్బన్ సీఐ కె.వీరాస్వామి తెలిపిన వివరాలు... రవితేజ అనే యువకుడు విజయవాడకు చెందిన తన స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం మంగళగిరి గండాలయపేటలోని బా లిక ఇంట్లోకి ప్రవేశించాడు. బాలిక తల్లిదండ్రుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించి బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళ్లిపోయారు. బాలిక తల్లి మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తుళ్లూరులో ఉన్నట్టుగా గుర్తించి పోలీసులు ఆదివారం ఉదయం రక్షించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ వీరాస్వామి చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న రవితేజను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, మిగతా ఎనిమిది మంది నిందితులను విజయవాడ పోలీసు స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.