Minister Atchannaidu: ‘డెయిరీ’కి సాంకేతికతను జోడించాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:59 AM
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ రంగమే వెన్నెముక అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
కోజికోడ్ సదరన్ డెయిరీ, ఫుడ్ కాంక్లేవ్‌లో మంత్రి అచ్చెన్న
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ రంగమే వెన్నెముక అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కేరళలోని కోజికోడ్‌లో జరిగిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాంక్లేవ్-2026లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘పోషకాహారంగా పాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. గ్రామీణుల జీవన విధానంలో ముఖ్యమైన పశుపోషణను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ విధానాలను అన్వయించి, డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఇందుకోసం ఇండియన్ డెయిరీ అసోసియేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా డెయిరీ రంగంతో పాటు సేవా రంగంలో ఆదర్శనీయ పాత్ర పోషిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకున్నారు. భారతీయ పాడి రంగంలో విశిష్ట స్థాయికి ఎదిగిన భువనేశ్వరి డెయిరీ రంగానికి మార్గదర్శకులని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడును ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.