శ్రీశైలం ప్లంజ్‌పూల్ మరమ్మతుకు సాంకేతిక నిపుణుల బృందం
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:44 AM
శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మతు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్ర జలసంఘం సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించింది.
ఏర్పాటు చేసిన జలసంఘం
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మతు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్ర జలసంఘం సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించింది. తన చీఫ్ ఇంజనీర్ (డిజైన్స్) వివేక్ త్రిపాఠి అధ్యక్షతన పై బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో సోమేశ్‌కుమార్, సుమంత్, అరుణ్ ప్రతాప్, మధుకాంత్ గోయల్ (జలసంఘం), మనీశ్ గుప్తా (సీఎ్‌సఎంఆర్‌ఎస్) ఎంకే వర్మ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్), శైలేంద్రసింగ్ (జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా), శ్రీశైలం డ్యాం చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. బృందం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి ప్లంజ్‌పూల్ మరమ్మతులు ఎలా చేయాలో అధ్యయనం చేస్తుంది.