సింహాద్రి ఎన్‌టీపీసీ రెండో యూనిట్‌లో ఉత్పత్తికి అంతరాయం
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:47 AM
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల సింహాద్రి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ)లోని రెండో యూనిట్...
పరవాడ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల సింహాద్రి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ)లోని రెండో యూనిట్ (500 మెగావాట్లు)లో సోమవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ యూనిట్‌లో ఉత్పత్తి అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఒకటో యూనిట్‌లో గత శనివారం సాంకేతిక లోపం తలెత్తడంతో ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్లాంటులో మూడు, నాలుగు యూనిట్‌లలో మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని అధికారులు తెలిపారు.