Share News

ప్రతిభకు రెక్కలు తొడిగిన గురువు

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:03 AM

‘మంచి గురువులు పాఠాలు చెప్పడమే కాదు.. విద్యార్థుల కలలకు రెక్కలు కూడా తొడుగుతారు’ అనే మాటకు ఓ ఉపాధ్యాయుడు చేసిన పని నిదర్శంగా నిలుస్తుంది.

ప్రతిభకు రెక్కలు తొడిగిన గురువు

  • టెన్త్‌ సోషల్‌లో 100 మార్కులు సాధించిన విద్యార్థికి విమానయానం

  • గన్నవరం నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లిన టీచర్‌

లింగపాలెం, జూలై 11(ఆంధ్రజ్యోతి): ‘మంచి గురువులు పాఠాలు చెప్పడమే కాదు.. విద్యార్థుల కలలకు రెక్కలు కూడా తొడుగుతారు’ అనే మాటకు ఓ ఉపాధ్యాయుడు చేసిన పని నిదర్శంగా నిలుస్తుంది. తాను బోధించే సోషల్‌ సబ్జెక్ట్‌లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విమానం ఎక్కించి వినూత్నంగా అభినందించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మం డలం కలరాయనగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సోషల్‌ ఉపాధ్యాయుడు కె.వజ్రకుమార్‌ గత విద్యాసంవత్సరం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి ఒక ఆఫర్‌ ఇచ్చారు. తన సబ్జెక్ట్‌లో 100 శాతం మార్కులు తెచ్చుకుంటే విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళతానన్నారు. ఆ స్కూల్‌ విద్యార్థి కొండపల్లి విన య్‌ సోషల్‌లో 100/100 మార్కులు సాఽధించాడు. దీంతో వినయ్‌ను తన సొంత ఖర్చులతో శనివారం గన్నవరం నుంచి విమానంలో హైదరాబాద్‌ కు తీసుకెళ్లి అక్కడ ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాలను ఆ టీచర్‌ చూపించారు.

Updated Date - Jul 12 , 2026 | 06:04 AM