పిల్లలకు అర్థమయ్యేలా బోధించండి
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:47 PM
పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన సాగించాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు సు రే్‌షకుమార్ సూచించారు.
- విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకుడు సురేష్‌కుమార్
ఆలూరు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన సాగించాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు సు రే్‌షకుమార్ సూచించారు. ఆదివారం ఆలూరు ఏపీ మోడల్ స్కూల్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంస్థలను మంత్రి నారా లోకేశ చేపడుతున్నారని, అందుకు అనుగుణంగా మారిన పాఠ్య పుస్తకాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు సంసిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన అందించాలన్నారు. అలాగే అడ్మిషన్ల శాతం కూడా పెరగాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ రఫిక్, మండల విద్యాధికారి కోమలాదేవి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ వీరేష్ పాల్గొన్నారు.