రాష్ర్టాన్ని నాశనం చేయాలని జగన్ కుట్ర
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:54 AM
రాష్ర్టాన్ని నాశనం చేయాలని జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు.
రెండేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: బుద్దా వెంకన్న
విజయవాడ అర్బన్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ర్టాన్ని నాశనం చేయాలని జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. బుధవారం విజయవాడలో బుద్దా మాట్లాడుతూ జగన్ ఫ్రస్ర్టేషన్‌లో మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చి చిత్తుచిత్తుగా ఓడించిన ప్రజలపై కక్ష సాధించాలని చూస్తున్నాడని విమర్శించారు. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగంగా చర్చించటానికి జగన్ రావాలని సవాల్ విసిరారు.