వైసీపీ సైకోల బెదిరింపులకు భయపడొద్దు: జూలకంటి
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:15 AM
వైసీపీ సైకో బ్యాచ్ బెదిరింపులకు అధికారులు ఎవరూ భయపడొద్దని, చట్ట ప్రకారం విధులు నిర్వర్తించాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు.
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ సైకో బ్యాచ్ బెదిరింపులకు అధికారులు ఎవరూ భయపడొద్దని, చట్ట ప్రకారం విధులు నిర్వర్తించాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు అధికార మత్తు వదల్లేదని అన్నారు. ఐదేళ్లపాటు వైసీపీ సైకో ముఠా చేసిన అరాచకాన్ని ప్రజలు మర్చిపోలేదని అన్నారు. జగన్ తాను ఇంకా సీఎంననే భ్రమలోనే ఉన్నారని, వైసీపీ నేతలు కూడా అదే భ్రమలో ఉన్నారని, అధికారులకు వార్నింగ్‌లు ఇవ్వడం, బెదిరించడం వైసీపీ నాయకుల అధికార పిచ్చికి పరాకాష్ట అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినా, పిన్నెల్లి మనసు ఇంకా జైలునే కోరుకుంటోందన్నారు.