Share News

గొడవ వద్దన్నాడని..!

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:34 AM

ఏలూరు జిల్లా వేల్పుచర్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తపై వైసీపీ సర్పంచ్‌తోపాటు మరికొంత మంది కార్యకర్తలు దాడి చేశారు.

గొడవ వద్దన్నాడని..!

  • టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దాడి

ముసునూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా వేల్పుచర్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తపై వైసీపీ సర్పంచ్‌తోపాటు మరికొంత మంది కార్యకర్తలు దాడి చేశారు. బడుగు రంజిత్‌కుమార్‌ ఆదివారం రాత్రి సింగవరం సెంటర్‌లో ఉండగా... సమీపంలోని మద్యం దుకాణం వద్ద.. అదే గ్రామానికి చెందిన కొయ్యూరి నాగరాజుకు, మరికొంత మందికి మధ్య గొడవ జరుగుతోంది. రంజిత్‌కుమార్‌ గొడవలు ఎందుకంటూ సర్దిచెప్పబోయాడు. అతడితో నాగరాజు వాదనకు దిగి చెయ్యిచేసుకున్నాడు. రంజిత్‌కుమార్‌ వెళ్లిపోయిన కొద్దిసేపటికి నాగరాజుతోపాటు సర్పంచ్‌ పుట్ట మోహన్‌రావు, దుర్గారావు, కొయ్యూరి ఏడుకొండలు, నాని, సామియేలు మరికొంత మంది కర్రలు, కత్తులతో బైక్‌లపై రంజిత్‌కుమార్‌ ఇంటి వద్ద అతన్ని చంవేస్తామని హల్‌చల్‌ చేశారు. గ్రామ పెద్దలు కలుగజేసుకుని మాట్లాడుతుండగా నాగరాజు, మరో ఐదుగురు రంజిత్‌పై దాడికి పాల్పడ్డారు. అతడికి గాయాలు కావడంతో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 27 , 2026 | 04:35 AM