Share News

మహిళలను దారుణంగా కించపరిచారు

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:14 AM

హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాలకు..

మహిళలను దారుణంగా కించపరిచారు

  1. అమర్నాథ్‌పై మహిళా కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాలకు చెందిన టీడీపీ మహిళా నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనితను ఉద్దేశించి అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యలు మహిళా ప్రజాప్రతినిధి గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని బుధవారం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని శైలజ హామీ ఇచ్చారు.

Updated Date - Jun 18 , 2026 | 04:15 AM