నూతన కమిటీలకు దిశానిర్దేశం!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:37 AM
సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించింది.
నేడు టీడీపీ వర్క్‌షాపు.. హాజరుకానున్న చంద్రబాబు, లోకేశ్
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఇటీవలే జిల్లా కమిటీల నియామకం పూర్తి చేసిన నాయకత్వం.. వాటికి దిశానిర్దేశం చేసేందుకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాపు నిర్వహిస్తోంది. 25 పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు, కమిటీ సభ్యులందరినీ దీనికి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నేతలు పాల్గొంటారు.