ఆ నేతలకు శ్రీముఖాలు!
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:31 AM
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు నియోజకవర్గ ఇన్‌చార్జులకు నోటీసులు ఇచ్చేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు.
నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇన్‌చార్జులకు నోటీసులివ్వనున్న టీడీపీ నాయకత్వం
జాబితాలో పుట్టా సుధాకర్, మాధవిరెడ్డి,వరదరాజులురెడ్డి, చైతన్యరెడ్డి, బీటెక్ రవి, పరిటాల శ్రీరాం
పార్టీ క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ విధిగా నిర్వహించాల్సిందే
ఎవరినీ ఉపేక్షించేది లేదు: లోకేశ్
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు నియోజకవర్గ ఇన్‌చార్జులకు నోటీసులు ఇచ్చేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి వరుసగా నాలుగు వారాలు క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించలేదు. ఇందుకు కారణాలేంటో అడిగి తెలుసుకుని వారికి నోటీసులు జారీ చేయాలని పల్లాను మంత్రి లోకేశ్ ఆదేశించారు. అలాగే నాలుగు వారాలుగా క్యాడర్ సమావేశాలు నిర్వహించని పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే పుట్టా చైతన్యరెడ్డి, గ్రీవెన్స్ నిర్వహించని ధర్మవరం ఇన్‌చార్జి పరిటాల శ్రీరాంకు కూడా నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు. వారిచ్చే సంజాయిషీని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కచ్చితంగా నిర్వహించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు.