Share News

వాళ్లు.. క్రెడిట్‌ చోరీ రాబందులు: మద్దిపట్ల

ABN , Publish Date - Jul 08 , 2026 | 04:01 AM

శవం ఎక్కడ కనబడితే అక్కడ వాలే రాబందుల్లా.. గొడ్డలి పార్టీ నేతలు క్రెడిట్‌ చోరీ కోసం ఎగబడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ విమర్శించారు.

వాళ్లు.. క్రెడిట్‌ చోరీ రాబందులు: మద్దిపట్ల

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): శవం ఎక్కడ కనబడితే అక్కడ వాలే రాబందుల్లా.. గొడ్డలి పార్టీ నేతలు క్రెడిట్‌ చోరీ కోసం ఎగబడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ విమర్శించారు. ‘రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపనలు తప్పించి ఏ నిర్మాణ పనులను ప్రారంభించలేదు. నేడు కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులను ప్రారంభిస్తుంటే క్రెడిట్‌ చోరీ చేయడానికి గొడ్డలి పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.’ అని మద్దిపట్ల అన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 04:02 AM