నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:07 AM
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ సోమవారం నా మినేషన్లు దాఖలు చేయనున్నారు.
వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి అసెంబ్లీకి సైకిల్ ర్యాలీ
అమరావతి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ సోమవారం నా మినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపా లెం టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 10 గంటలకు పూ జలు నిర్వహించి, అక్కడి నుంచి ముగ్గురు అభ్యర్థులు సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుంటారు. 10.45 గంటలకు నామినేషన్లు సమర్పిస్తారు. వీరి నామినేషన్లను కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నారు. సానా సతీశ్ రెండోసారి రాజ్యసభకు వెళుతుండగా, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు.