నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:54 AM
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనుంది.
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనుంది. ఈనెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
పరిటాల రవికి సీఎం నివాళి
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. పేదల కోసం కృషి చేసిన రవి భౌతికంగా మనకు దూరమైనా ఆయన పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. మంత్రి లోకేశ్ కూడా పరిటాల రవికి నివాళులర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రవి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయవాడ పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, తదితరులు పాల్గొన్నారు.