Share News

టీడీపీ కార్యాలయంలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:42 AM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న టీడీపీ కేంద్ర కార్యాలయంలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీడీపీ కార్యాలయంలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న టీడీపీ కేంద్ర కార్యాలయంలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో జాతీయ జెండాను ప్రత్యేకంగా ముంబై నుంచి తెప్పించారు. దాని పక్కనే 102 అడుగుల ఎత్తులో పార్టీ జెండాను కూడా ఏర్పాటు చేశారు. ఈ జెండాలను ఎగురవేసే సమయంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకు ఆటోమేటిక్‌ మూవింగ్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీనిని శనివారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

Updated Date - Jan 25 , 2026 | 03:43 AM