Share News

నేడు టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Apr 29 , 2026 | 04:18 AM

తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం జరగనుంది. టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా యువనేత, మంత్రి లోకేశ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

నేడు టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

  • పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న లోకేశ్‌

  • జాతీయ, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించనున్న 252 మంది

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం జరగనుంది. టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా యువనేత, మంత్రి లోకేశ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మొత్తం 252 మందితో టీడీపీ నూత న కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన కమిటీలో పొలిట్‌బ్యూరో సభ్యులుగా 29 మందిని నియమించారు. జాతీయ కమిటీలో 31 మందికి అవకాశం ఇచ్చారు. వారిలో 18 మంది జాతీయ ఉపాధ్యక్షులుగా, ముగ్గురికి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 10 మందికి జాతీయ అధికార ప్రతినిధులుగా అవకాశం ఇచ్చారు. జాతీయ కోశాధికారిగా ఒకరికి అవకాశం ఇచ్చా రు. రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివా్‌సకి మరోసారి అవకాశం ఇచ్చా రు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఏడుగురు, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 15 మంది, జోనల్‌ కో-ఆర్డినేటర్లుగా 10 మందికి అవకాశం కల్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా 77 మందికి అవకాశం ఇచ్చారు. మీడియా కమిటీ సభ్యులుగా ఇద్దరు, హెచ్‌ఆర్‌డీఏ కమిటీ సభ్యులుగా ఒక్కరికి అవకాశం ఇచ్చారు. నాలెడ్జ్‌ సెంటర్‌ బాధ్యతలు ఒకరికి అప్పగించారు.

Updated Date - Apr 29 , 2026 | 04:18 AM