Share News

ఉపరాష్ట్రపతి, స్పీకర్‌తో టీడీపీ ఎంపీల భేటీ

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:02 AM

అమరావతి ప్రయాణాన్ని వివరిస్తూ రూపొందించిన ‘‘అమరావతి: బిల్ట్‌ బై ది పీపుల్‌, సెక్యూర్డ్‌ బై డెస్టినీ’’ కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు టీడీపీ ఎంపీల బృందం అందజేసింది.

ఉపరాష్ట్రపతి, స్పీకర్‌తో టీడీపీ ఎంపీల భేటీ

  • అమరావతి కాఫీ టేబుల్‌ పుస్తకం అందజేత

న్యూఢిల్లీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రయాణాన్ని వివరిస్తూ రూపొందించిన ‘‘అమరావతి: బిల్ట్‌ బై ది పీపుల్‌, సెక్యూర్డ్‌ బై డెస్టినీ’’ కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు టీడీపీ ఎంపీల బృందం అందజేసింది. మంగళవారం, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో టీడీపీ ఎంపీల బృందం ప్రముఖులకు వేర్వేరుగా ఈ కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని అందజేసింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కూడా ఈ పుస్తకాన్ని అందజేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన చారిత్రక పరిణామాలు, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తి, రైతులు, మహిళల 1631 రోజుల సుదీర్ఘ పోరాటం వరకు, అలాగే జూన్‌ 2, 2024 నుంచి పునరుత్తేజం పొందిన అమరావతి ప్రయాణాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోంది. సీఎం చంద్రబాబు దూరదృష్టి గల నాయకత్వంలో, ఎన్‌డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచస్థాయి రాజధానిగా సంపద సృష్టికి, నూతన ఆవిష్కరణలకు, ఆధునిక సాంకేతికతకు ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు, ఉపనేత దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. బృందంలో బీద మస్తాన్‌రావు యాదవ్‌, కలిశెట్టి అప్పలనాయుడు, అంబికా లక్ష్మీనారాయణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, తెన్నెటి కృష్ణప్రసాద్‌, బైరెడ్డి శబరి, జీఎం హరీశ్‌, బస్తిపాటి నాగరాజు, కేశినేని చిన్ని, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 04:03 AM