టీడీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ తేనీటి విందు
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:33 AM
లోకసభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో మంగళవారం టీడీపీ ఎంపీలకు తేనీటి విందును ఇచ్చారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): లోకసభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో మంగళవారం టీడీపీ ఎంపీలకు తేనీటి విందును ఇచ్చారు. ఈ విందుకు ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బైరెడ్డి శబరి, కేశినేని చిన్ని, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లాను ఎంపీలు శాలువాతో ఘనంగా సత్కరించారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఎంపీల నుంచి స్పీకర్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. తొలిసారి లోక్‌సభకు వచ్చినవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని తామంతా చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని ఎంపీ చిన్ని తెలిపారు.