Share News

‘అవిశ్వాసం’ కక్షసాధింపే: తెన్నేటి

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:34 AM

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం కేవలం ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య. అందులో పసలేదు’ అని టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అవిశ్వాసం’ కక్షసాధింపే: తెన్నేటి

న్యూఢిల్లీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ‘లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం కేవలం ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య. అందులో పసలేదు’ అని టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ తరఫున ఆయన మాట్లాడారు. ‘విపక్షాలు సమర్పించిన అవిశ్వాస తీర్మాన నోటీసు తప్పుల తడకగా ఉంది. ఆ నోటీసును సాంకేతికంగా తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఓం బిర్లా... తనపైనే వచ్చిన తీర్మానాన్ని పెద్ద మనసుతో అనుమతించారు. స్పీకర్‌ నిర్ణయం ప్రజాస్వామ్యంపై ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. స్పీకర్‌ ఓం బిర్లా కేవలం ఒక వ్యక్తి కాదు. సభా మర్యాదలకు రక్షకుడు’ అని తెన్నేటి అన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 03:34 AM