Share News

రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్న వైసీపీ: ఎంపీ బీద

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:33 AM

రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ ఎంపీలు గత రెండు రోజులుగా పార్లమెంటులో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్న వైసీపీ: ఎంపీ బీద

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ ఎంపీలు గత రెండు రోజులుగా పార్లమెంటులో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శంచారు. ఇటువంటి అబద్ధాలను తెలుగు ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం మస్తాన్‌రావు మాట్లాడారు.

Updated Date - Feb 05 , 2026 | 06:33 AM