Share News

విత్తన శుద్ధి పరిశ్రమను ఆదుకోండి

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:17 AM

సీజనల్‌ పరిశ్రమలైన విత్తన శుద్థి పరిశ్రమలకు సహజవాయువు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్‌దీప్ సింగ్‌ పూరికి...

విత్తన శుద్ధి పరిశ్రమను ఆదుకోండి

  • కేంద్ర మంత్రి హర్‌దీ్‌పసింగ్‌కు ఎంపీ లావు లేఖ

న్యూఢిల్లీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సీజనల్‌ పరిశ్రమలైన విత్తన శుద్థి పరిశ్రమలకు సహజవాయువు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిహర్‌దీప్ సింగ్‌ పూరికి టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు విజ్ఞప్తి చేశారు. విత్తనశుద్ధి పరిశ్రమకు ఫిబ్రవరి - ఏప్రిల్‌ మధ్య ఉండే పీక్‌ సీజన్‌ అవసరాల ప్రాతిపదికన గ్యాస్‌ కేటాయింపులు జరపాలని, విత్తనోత్పత్తి రంగాన్ని కాపాడాలని కోరారు. ఈమేరకు గురువారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఇటీవల కేంద్రం జారీ చేసిన సహజ వాయువు సరఫరా క్రమబద్థీకరణ ఉత్తర్వుల వల్ల విత్తన శుద్థి పరిశ్రమకు ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విత్తనాల తేమను తగ్గించి, నాణ్యతను కాపాడేందుకు గ్యాస్‌ ఆధారిత డ్రైయర్లు అత్యవసరమని, గ్యాస్‌ సరఫరాలో అంతరాయం కలిగితే విత్తన లభ్యతపై ప్రభావం చూపి రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. గత ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా గ్యాస్‌ సరఫరాను నిర్ణయించడం విత్తన శుద్థి పరిశ్రమకు ఇబ్బందిగా మారిందన్నారు. గత ఆరు నెలల సగటును లెక్కగడితే ఈ సీజన్‌లో సరిపడా గ్యాస్‌ అందక పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 13 , 2026 | 05:18 AM