హత్యా రాజకీయాలకు పేటెంట్ వైసీపీదే
ABN , Publish Date - May 23 , 2026 | 06:13 AM
హత్య రాజకీయాలకు పేటెంట్ రైట్ వైసీపీ. హత్య రాజకీయాలకు నెలవైన వైసీపీ పార్టీ సింబల్ గొడ్డలి అయితే బాగుంటుంది’ అని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సూచించారు.
మావిగన్‌తో జోకర్‌లా జగన్... ఆయనో కామెడీ పీస్: ఎంపీ చిన్ని
న్యూఢిల్లీ, మే 22(ఆంధ్రజ్యోతి): హత్య రాజకీయాలకు పేటెంట్ రైట్ వైసీపీ. హత్య రాజకీయాలకు నెలవైన వైసీపీ పార్టీ సింబల్ గొడ్డలి అయితే బాగుంటుంది’ అని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. శుక్రవారం ఏపీ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘హత్యా రాజకీయాలను మా పార్టీ ప్రోత్సహించబోదు. తండ్రి వైఎస్ శవం దొరకకముందే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన చరిత్ర జగన్‌ది. ఆయన మావిగన్ పేరెత్తిన ప్రతిసారీ వైసీపీ నేతల గుండెలు జారిపోతున్నాయి. జీవితంలో వైసీపీ అధికారంలోకి రాదని డిసైడ్ అయిపోతున్నారు. సీఎం చంద్రబాబు 76 ఏళ్ల వయస్సులో రోజుకు 18 గంటలు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. మావిగన్‌తో జగన్ జోకర్‌లా, కామెడీ పీస్‌గా మిగిలిపోతున్నారు’ అని ఎంపీ విమర్శించారు.